కొల్లాపూర్ రూరల్/పెంట్లవెల్లి, ఏప్రిల్ 9 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27 జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ రైటింగ్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. పెంట్లవెల్లిలో గులాబీ శ్రేణులతో సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. బీరం మాట్లాడుతూ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ అమలుకాని హామీలు గుప్పించి జనాలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇంటి పార్టీ బీఆర్ఎస్తోనే సాధ్యమని చెప్పారు.