Bathukamma Song | హైదరాబాద్ : ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ పట్ల రాష్ట్రంలోని ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. గ్యారెంటీలు, హామీలన్నీ మోసం అని తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తూ.. రైతులపై ఉక్కుపాదం మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. నిరుద్యోగులను కూడా నిలువునా మోసం చేయడంపై వారు కూడా రేవంత్‌పై కన్నెర్ర జేస్తున్నారు. రేవంత్ మోసాల వల్ల తెలంగాణ మొత్తం సమస్యల రాష్ట్రంగా మారింది.
ఈ క్రమంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు.. కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ బతుకమ్మ పాటలను ప్రత్యేకంగా పాడారు. మార్పు మార్పని వలలో… మనలని ముంచిండ్రే వలలో… అంటూ రేవంత్ సర్కార్‌ను చీల్చిచెండాడుతున్నారు.
మార్పు మార్పు అని.. చెయ్యి గుర్తుకు ఓటేస్తే
ఆగమాగం చేస్తున్రు.. ఆమ్మో ఈ కాంగ్రెసోళ్లు..
అరి గోసలు పెడ్తున్నారమ్మో ఈ కాంగ్రెసోళ్లు..
ఆరు గ్యారెంటీలని ఎరవేసి.. అన్నిటికీ ఎగనామం పెట్టిండ్రు
అంటూ బతుకమ్మ పాట రూపంలో మహిళలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ బతుకమ్మ పాటలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా మార్మోగనున్నాయి.
మార్పు మార్పని వలలో…
మనలని ముంచిండ్రే వలలో…కాంగ్రెస్ మోసపు పాలనపై దుమ్మురేపుతున్న బతుకమ్మ పాట 🎶🔥#BathukammaSong #Bathukamma
Link: https://t.co/U4SYTV99Sv pic.twitter.com/9qR1yAfyvW
— BRS Party (@BRSparty) September 18, 2025