Bathukamma Song | కాంగ్రెస్ మోసపు పాలనపై దుమ్మురేపుతున్న బతుకమ్మ పాట.. వీడియో
Bathukamma Song | బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు.. కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ బతుకమ్మ పాటలను ప్రత్యేకంగా పాడారు. మార్పు మార్పని వలలో... మనలని ముంచిండ్రే వలలో... అంటూ రేవంత్ సర్కార్‌ను చీల్చిచెండాడుతున్నారు.
Bathukamma Song | హైదరాబాద్ : ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ పట్ల రాష్ట్రంలోని ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. గ్యారెంటీలు, హామీలన్నీ మోసం అని తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తూ.. రైతులపై ఉక్కుపాదం మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. నిరుద్యోగులను కూడా నిలువునా మోసం చేయడంపై వారు కూడా రేవంత్‌పై కన్నెర్ర జేస్తున్నారు. రేవంత్ మోసాల వల్ల తెలంగాణ మొత్తం సమస్యల రాష్ట్రంగా మారింది.
ఈ క్రమంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు.. కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ బతుకమ్మ పాటలను ప్రత్యేకంగా పాడారు. మార్పు మార్పని వలలో… మనలని ముంచిండ్రే వలలో… అంటూ రేవంత్ సర్కార్‌ను చీల్చిచెండాడుతున్నారు.
మార్పు మార్పు అని.. చెయ్యి గుర్తుకు ఓటేస్తే
ఆగమాగం చేస్తున్రు.. ఆమ్మో ఈ కాంగ్రెసోళ్లు..
అరి గోసలు పెడ్తున్నారమ్మో ఈ కాంగ్రెసోళ్లు..
ఆరు గ్యారెంటీలని ఎరవేసి.. అన్నిటికీ ఎగనామం పెట్టిండ్రు
అంటూ బతుకమ్మ పాట రూపంలో మహిళలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ బతుకమ్మ పాటలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా మార్మోగనున్నాయి.
మార్పు మార్పని వలలో…
మనలని ముంచిండ్రే వలలో…కాంగ్రెస్ మోసపు పాలనపై దుమ్మురేపుతున్న బతుకమ్మ పాట 🎶🔥#BathukammaSong #Bathukamma
Link: https://t.co/U4SYTV99Sv pic.twitter.com/9qR1yAfyvW
— BRS Party (@BRSparty) September 18, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

