కుభీర్ : మండల కేంద్రం కుభీర్ పోలీస్ స్టేషన్ (Kubhir Police Station) పై ఖలీమ్ అనే ఆగంతకుడు కత్తితో దాడికి పాల్పడగా హెడ్ కానిస్టేబుల్ (Head Constable) నారాయణ, హోంగార్డు గిరి కి గాయాలయ్యాయి. ఖలీం అనే వ్యక్తి ఇంట్లో గొడవపడి పోలీస్ స్టేషన్కు కత్తితో వెళ్లి డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ నారాయణతో వాగ్వాదానికి దిగాడు. వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేయగా కడుపులో తీవ్రగాయమైంది. అడ్డువచ్చిన హోంగార్డు గిరిపై కూడా దాడి చేయడంతో అతడు గాయపడ్డాడు. ఇద్దరిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం భైంసా ఏరియా ఆసుపత్రికి తలరించారు. ఆగంతకుడు దాడి చేసి పారిపోయాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.