e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News తొలిసారిగా టైమ్ స్క్వైర్ వ‌ద్ద బ‌తుక‌మ్మ వేడుక‌లు.. తానా ఆధ్వ‌ర్యంలో న్యూయార్క్‌లో అంబ‌రాన్నంటిన సంబురాలు

తొలిసారిగా టైమ్ స్క్వైర్ వ‌ద్ద బ‌తుక‌మ్మ వేడుక‌లు.. తానా ఆధ్వ‌ర్యంలో న్యూయార్క్‌లో అంబ‌రాన్నంటిన సంబురాలు

ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం ( తానా ) ఆధ్వ‌ర్యంలో మునుపెన్న‌డూ లేనంత ఘ‌నంగా ఈ ఏడాది న్యూయార్క్‌లో బతుక‌మ్మ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఎప్పుడూ ర‌ద్దీగా ఉండే టైమ్ స్క్వైర్‌లో తొలిసారిగా ఈ బ‌తుక‌మ్మ వేడుక‌లు చారిత్రాత్మ‌క ఘ‌ట్టంగా నిలిచాయి. ఈ నెల 16న న్యూయార్క్ టైమ్ స్క్వైర్‌లో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన బ‌తుక‌మ్మ సంబురాలు అంబ‌రాన్ని అంటాయి. ముఖ్యంగా 20 అడుగుల ఎత్తుతో తీర్చిదిద్దిన బతుక‌మ్మ విశేషంగా ఆక‌ట్టుకుంది. సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన బతుక‌మ్మ వేడుక‌ల‌ను తానా అధ్య‌క్షులు లావు అంజ‌య్య చౌద‌రి.. జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

400 మందికి పైగా తెలుగు వారు న్యూ జెర్సీ, క‌నెక్టిక‌ట్‌ల‌తో పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి తెలుగువారు న్యూయార్క్ న‌గ‌రానికి చేరుకుని బ‌తుక‌మ్మ ఉత్స‌వాల్లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన బ‌స్సుల్లో బతుక‌మ్మ‌ల‌ను తీసుకుని వ‌చ్చి ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చిన తెలుగువారంద‌రితో టైమ్ స్క్వైర్ వేదిక రంగుల‌మ‌యంగా మారింది. వేదిక ప‌రిస‌రాల్లో ఎటు చూసిన రంగు రంగుల పూలు, పూల‌తో పోటీపడుతూ ప‌ట్టు చీర‌ల‌తో వెలిగిపోయింది. తెలుగుద‌నం ఉట్టిప‌డేలా సంప్ర‌దాయ దుస్తుల్లో తెలుగు ఆడ‌ప‌డ‌చుల బ‌తుక‌మ్మ పాట‌లు, నృత్యాలు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాలనుంచి విచ్చేసిన సభ్యుల సంప్రదాయ నృత్యాలు, మహిషాసుర మర్ధిని నృత్య రూపకం, చిన్నారుల జానపద నృత్యాలను ప్రదర్శించి ఆహూతులని ఆనందింపజేశారు. ఈ సంద‌ర్భంగా కార్యవర్గం ఆహూతులకు తెలుగు వంటకాలతో కమ్మని విందు అందించారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా సభ్యులంతా పెద్ద సంఖ్యలో హాజరై ఆటపాటలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -

బ‌తుక‌మ్మ‌ పండుగ‌ను మొట్ట మొద‌టిసారి విశ్వ‌వేదిక‌పై జ‌రుపుకోవ‌డం.. మ‌న తెలుగు జాతి సంస్కృతిని ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డం గ‌ర్వంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు. ఈ వేడుకకు సంబంధించిన స‌మాచారాన్ని తెలుగు వారంద‌రికీ అందించి.. వారిని స‌మ‌న్వ‌య ప‌రిచి.. ఉత్స‌వం విజ‌యవంతం కావ‌డంలో కీల‌క పాత్ర పోషించిన తానా క‌ల్చ‌ర‌ల్ కో ఆర్డినేట‌ర్ శిరీష తూనుగుంట్ల‌ను అభినందించారు. తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలు టైమ్ స్క్వేర్ ని వైవిధ్య భరితమైన పూలవనంగా మార్చాయి. ఈ ఉత్స‌వ‌రం సంద‌ర్భంగా బతుక‌మ్మ పండుగ విశిష్ట‌త‌ను జ‌య‌శేఖ‌ర్ తెలియ‌జేశారు. బ‌తుకమ్మ ఉత్స‌వాల సంద‌ర్భంగా తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నిరంజన్ శృంగ‌వ‌ర‌పు మాట్లాడుతూ.. సంస్థ ప్ర‌తిష్ట‌ను పెంచేలా మ‌రిన్ని కార్య‌క్ర‌మాల‌ను చేప‌డ‌తామ‌ని తెలిపారు. అమెరికాలోని వివిధ న‌గ‌రాల నుంచి తెలుగు వారంద‌రూ ఒక్క‌చోట చేరి ఈ ఉత్స‌వాలు జ‌ర‌పుకోవ‌డం ప‌ట్ల‌ తానా సెక్ర‌ట‌రీ స‌తీశ్ కుమార్ వేమూరి, కోశాధికారి అశోక్ కొల్లాల‌, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, బోర్డు ఆఫ్ ట్రస్టీ లు, ఫౌండేషన్ ట్రస్టీలు సంతోషం వ్య‌క్తం చేశారు. ఇది తెలుగు వారి సంప్ర‌దాయాల‌ను ప్ర‌పంచానికి చాటి చెబుతోంద‌ని ఈ సంద‌ర్భంగా వారు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్టానా జట్లు సమన్వయం చేశాయి. 20 అడుగుల బతుకమ్మని పేర్చడానికి కృషి చేసిన న్యూ జేర్సీ BOD లక్ష్మి దేవినేని గారిని అభినందించారు. బ్రూక్లీన్ బరో ప్రెసిడెంట్ ఆఫీసు ప్రతినిధి గా విచ్చేసిన దక్షిణ ఆసియా విషయాల డైరెక్టర్ దిలీప్ చౌహాన్, తెలుగు సంస్కృతిని చాటి సేవ చేస్తున్న తానాకి మేయర్ ద్వారా జారీ చేయబడిన అభినందన పత్రాన్ని అందించారు. న్యూ జర్సీ యుటిలిటీస్ కమిషనర్ చివుకుల ఉపేంద్ర తానా కృషిని అభినదించి తెలుగు వారికి ఎలాంటి అవసరాలున్నా తాము అండగా ఉంటాము అని హామీ ఇచ్చారు. వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా హాజరై తానా చేసిన ఈ బృహత్కార్యక్రమాన్ని ప్రశంసించారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement