హనుమకొండ, సెప్టెంబర్ 28 : హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాలసముద్రం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్కపూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో పార్టీ కార్యాలయం పూలవనాన్ని తలపించింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్, బీఆర్ఎస్ పాటలతో పాటు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను వివరిస్తూ పాటలు పాడారు. బతుకమ్మ ఆడిన ఆడబిడ్డలకు భోజనాలు పెట్టి బతుకమ్మ కానుకగా చీరెలు పంచిపెట్టారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ పండుగలు తెలియని దుస్థితి కాంగ్రెస్‌దని ఎద్దేవా చేశారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మహిళా నేతలు సుశీలారెడ్డి, సుమిత్రాఆనంద్, రేణుక, పావనీగౌడ్, రజితారెడ్డి, మహిళా నేతలు పెద్ది స్వప్న, ఎల్లావుల లలితాయాదవ్, డాక్టర్ హరి రమాదేవి, మాజీ విప్ దాస్యం వినయ్‌భాసర్ సతీమణి రేవతీభాసర్, దాస్యం విజయ్భాసర్ సతీమణి శిరీష, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ మేయర్ రిజ్వానామసూద్, కార్పొరేటర్ నల్ల స్వరూపారాణి, ఇమ్మడి లోహితారాజు, నాయకుడు దాస్యం విజయ్భాసర్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కమురున్నీసాబేగం, నయీమొద్దీన్, బొద్దు వెంకన్న, పోలపల్లి రామ్మూర్తి, వెంకన్న పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. తెలంగాణ సంస్కృతిని పరిరక్షించిన కేసీఆర్ అందించిన కానుకలతో పండుగలు నిర్వహించుకునేవారు. తెలంగాణ అస్తిత్వాన్ని మరువని నేత కేసీఆర్. సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్‌కే దకుతుంది. కేసీఆర్ పదేండ్ల పాలనలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు ఆత్మ గౌరవ భవనాలు, వారి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించిన ఘనత కేసీఆర్‌ది.