NZ vs BAN : సొంత గడ్డపై న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్(Bangladesh) ఆలౌట్ ప్రమాదంలో పడింది. కివీస్ స్పిన్నర్ల ధాటికి ఆ జట్టు ఏడు వికెట్లు కోల్పోయింది. అజజ్ పటేల్ 2, ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్ 3 వికెట్లతో బంగ్లా నడ్డి విరిచారు. దాంతో ఆతిథ్య జట్టు 76 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. ప్రస్తుతం నురుల్ హసన్(24), నయీం హసన్(2) ఆడుతున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లా 39 పరుగులకే ఓపెనర్ జకీర్ హసన్(12) వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ అజాజ్ పటేల్(Ajaz Patel) బౌలింగ్లో బంతిని అంచనా వేయలేక జకీర్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జాయ్, కెప్టెన్ నజ్ముల్ శాంటో(37) రెండో వికెట్కు 43 పరుగులు జోడించారు. శాంటో వెనుదిరిగాక వచ్చిన
Glenn Phillips with another!
Gets the debutant Shahadat Hossain, he was looking good during that entertaining partnership with Nurul Hasan#BANvNZ
— ESPNcricinfo (@ESPNcricinfo) November 28, 2023
మొమినుల్ హక్(37)తో కలిసి జాయ్ 88 పరుగులు జోడించాడు. అయితే.. అతడు జట్టు స్కోర్ 184 పరుగుల వద్ద ఇష్ సోధీ ఓవర్లో డారిల్ మిచెల్ చేతికి చిక్కాడు. అక్కడితో బంగ్లా వికెట్ల పతనం మొదలైంది. ఆ తర్వాత ముష్ఫికర్ రహీం(12), మిరాజ్(20), షహదాత్ హొసేన్(24) ఎక్కువ సేపు నిలబడలేకపోయారు.