ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) చిరిగిన, ఫేడెడ్ షూస్ ధరించిన పిక్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో ఇదే న్యూ ట్రెండ్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముంబైలో ఇటీవల ఫ్యారీస్ స్క్రీనింగ్‌కు హాజరైన సందర్భంగా ఈవెంట్‌కు టార్న్ షూస్‌తో హాజరవడంతో ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు.
స్క్రీనింగ్ ఈవెంట్‌కు హాజరైన సల్మాన్ ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. డార్క్ షర్ట్, ఫార్మల్ ప్యాంట్స్‌తో సల్మాన్ కనిపించగా ఆయన ధరించిన షూస్ అందరి దృష్టినీ ఆకర్షించాయి. న్యూ ట్రెండ్ ఇక మొదలవుతుందని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఇలాంటి షూస్ సల్లూ భాయ్‌కు సౌకర్యవంతంగా ఉంటాయని మరో యూజర్ కామెంట్ చేశారు.
ఇక ఇదే ఈవెంట్లో తన ఫ్రెండ్, టైగర్ 3 సహనటి కత్రినా కైఫ్‌తో సల్మాన్ కెమెరాలకు ఫోజులిచ్చారు. ఈ సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినా థియేటర్ల వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.
Read More :