Chef Gary Mehigan | దేశీ టిఫిన్స్ ఎంజాయ్ చేసిన ఆస్ట్రేలియా చెఫ్
బెంగళూర్ రెస్టారెంట్లో ఆస్ట్రేలియన్ మాస్టర్‌చెఫ్ గ్యారీ మెహిగన్ (Chef Gary Mehigan)ఇటీవల దక్షిణాది అల్పాహారాన్ని ఇష్టంగా లాగించారు.
చెన్నై : ఇడ్లీ, వడ, దోశ, సాంబార్ రైస్ ఇలా దక్షిణాది డిష్‌లు ఏవైనా అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. సదరన్ స్పైసీ రెసిపీలను ఆస్వాదించేందుకు దేశ, విదేశీయులు మొగ్గుచూపుతుంటారు. బెంగళూర్ రెస్టారెంట్లో ఆస్ట్రేలియన్ మాస్టర్‌చెఫ్ గ్యారీ మెహిగన్ (Chef Gary Mehigan)ఇటీవల దక్షిణాది అల్పాహారాన్ని ఇష్టంగా లాగించారు.
బెంగళూర్‌లో ఉండగా ఆయన పాపులర్ కేఫ్‌లో దక్షిణాది వంటకాలను ప్రయత్నించిన ఫొటోలను చెఫ్ గ్యారీ మెహిగన్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. రామేశ్వరం కేఫ్‌ను సందర్శించిన గ్యారీ అకకడ రాగి దోశ, ఘీ రోస్ట్ దోశ, మేదు వడ, ఘీ పొడి ఇడ్లీ, కేసరి బాత్‌ను టేస్ట్ చేయడంతో పాటు ఫిల్టర్ కాఫీని కూడా ఆస్వాదించారు. ఇది సరైన దోశ, నేను మళ్లీ వస్తా అని ఇన్‌స్టా పోస్ట్‌కు అతడు క్యాప్షన్ ఇచ్చాడు.
ఈ పోస్ట్ కొద్దిసేపటికే నెట్టింట తెగ వైరలవుతోంది. బెంగళూర్‌లో ఇతర రెస్టారెంట్ల వివరాలను కూడా కొందరు నెటిజన్లు ప్రస్తావించగా, అతడు నా కంటే ఎక్కువ భారతీయుడని ఓ వ్యక్తి కామెంట్ చేయగా, ఇందిరా నగర్లో ఫిల్టర్ కాఫీ ఇంకా బాగుంటుందని మరో నెటిజన్ రాసుకొచ్చారు. ఇక్కడ వెల్లుల్లి రోస్ట్ దోశ తింటే వదిలిపెట్టరని మరో యూజర్ కామెంట్ చేశారు. భారత్‌లో గ్యారీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడని మరొకరు కామెంట్ చేశారు.
Read More :
Space Economy | భారత్‌లో స్పేస్ ఎకానమీ దూకుడు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

