చర్లపల్లి, నవంబర్ 13 : ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చే యనున్నట్లు బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం చర్లపల్లి డివిజన్‌కు చెందిన వీఎన్‌రెడ్డినగర్ కాలనీలో అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం నాయకులతో సమావేశం కాగా.. కాలనీవాసులు బండారికి పూర్తి మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేశారని, నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి తన వంతు కృషి చేయనున్నట్లు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం సాధించని ప్రగతిని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రా ష్ట్రం సాధించిందని అన్నారు.
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ పలు పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు పలు సంక్షేమ పథకాలతో ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందించారన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమం, ఎన్నికల సందర్భంగా రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టోకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు, సంక్షేమ సంఘం నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ఉప్పల్‌లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ అం దించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, నాయకులు వాసుదేవరెడ్డి, హన్ముంత్‌రెడ్డి, బాల్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, సూర్యభగవాన్, రాంచందర్, వెంకట్రావు, రంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కనకరాజుగౌడ్తో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.