నిజాంపేట,ఫిబ్రవరి23 : అక్రమంగా చెరువులో చేపలు పట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బచ్చురాజ్ మత్స్యకారులు(ముదిరాజ్) నిజాంపేట ఎస్సై శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ.. బచ్చురాజ్‌పల్లి మత్స్య సొసైటీ పరిధిలో జెడ్చెర్వు తండాలోని చెరువు ఉండగా.. రమావత్ రాజు, రమావత్ రామోజీ, రమావత్ శ్రీనివాస్‌లు అక్రమంగా తమ చెరువులో వలలు వేసి చేపలు పట్టారని మండిపడ్డారు. చేపల పెంపకంతో జీవనోపాధి పొందుతున్న మాలాంటి మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరారు. అక్రమంగా చేపలు పట్టినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిజాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసిన వారిలో మత్స్యకారుల(ముదిరాజ్) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్, బచ్చురాజుపల్లి గ్రామ మత్స్యకారులు రాజు, స్వామి, మల్లేశం, శ్రీనివాస్, రవి, లింగం, మల్లయ్య, చంద్రం, బాలయ్య, శంకర్, సాయిలు, మహేశ్, యాదగిరి, ఎల్లం తదితరులు ఉన్నారు.