నిజామాబాద్ : గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు(Babli gates) ఇరు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ అధికారులు మూసివేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేశాయి.
గోదావరి నదిలోకి ఎగువ భారీ ప్రవాహం కొనసాగుతుండడంతో మూసివేసిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను కొంతమేర తెరిచి ఉంచినట్లుగా ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. తిరిగి వేసవికాలం ప్రారంభంలో తాగునీటి అవసరాల కోసం బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తనున్నారు.