హైదరాబాద్ : సికింద్రాబాద్లోని కోరమాండల్ హౌజ్ ఎదురుగా సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చెత్త తరలించే లారీ కింద పడి ఓ అయ్యప్ప భక్తుడు దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వయసు 45 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు.