నారాయణపేట : జిల్లాలో మూడవ విడతలో మక్తల్ నియోజకవర్గంలోని నర్వ, మాగనూరు, కృష్ణ, మక్తల్, ఉట్కూర్ మండలాల్లో పంచాయతీ ఎన్నికలు (Panchayat Election) జరుగనున్నాయి. మొత్తం 110 గ్రామ పంచాయతీలు ఉండగా 10 గ్రామ పంచాయతీ సర్పంచ్ ( Sarpanches ) స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 100 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం 327 మంది పోటీ పడుతున్నారు.
994 వార్డులు ఉండగా 229 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 775 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 1,992 మంది పోటీ పడుతున్నారు. 55 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు వివరించారు. ఈ ఐదు మండలాల్లో మొత్తం 920 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు , 2,586 మంది ఎన్నికల సిబ్బంది విధులు, 79 బస్సుల ఏర్పాటు చేశామని, 183 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.