Raja Saab | టాలీవుడ్ డైరెక్టర్ మారుతి-గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబోలో వస్తోన్న చిత్రం రాజాసాబ్ (Raja saab). పాన్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్, రిద్దికుమార్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజికల్ ఆల్బమ్ నుంచి మరో సాంగ్ వస్తోంది.
ఈ మూవీలో ప్రభాస్, నిధి అగర్వాల్ కాంబోలో వచ్చే Sahana Sahana ట్రాక్‌ను హైదరాబాద్‌లోని లులూ మాల్లో లాంచ్ చేయనున్నారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి సాంగ్ లాంచ్ ఈవెంట్ షురూ కానుంది. ప్రభాస్, నిధి అగర్వాల్ సిల్వర్ స్క్రీన్‌పై మ్యూజికల్ మ్యాజిక్చేయబోతున్నారంటూ షేర్ చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే షేర్ చేసిన రాజాసాబ్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
రాజాసాబ్ గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ నయా లుక్‌లో కనిపిస్తూ అభిమానులు, మూవీ లవర్స్‌కు విజువల్ ట్రీట్ ఇస్తున్నాడు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రాజాసాబ్‌లో సంజయ్ దత్ సంజూబాబా పాత్రలో కనిపించబోతున్నాడు.
Celebrate this musical magic of #SahanaSahana at the Song Launch Event TOMORROW 💥💥🔥🔥
📍 Lulu Mall, Hyderabad | ⏰ 5:00 PM onwards#TheRajaSaab #Prabhas #RebelStarPrabhas pic.twitter.com/FMiv9Y3gYr
— BA Raju’s Team (@baraju_SuperHit) December 16, 2025
45 Official Trailer | శివన్న – ఉపేంద్రల మెగా మల్టీస్టారర్.. ’45’ ట్రైలర్ విడుదల