కాచిగూడ,డిసెంబర్ 16: కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి అవకాశాలు గల పలు కోర్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు.
మంగళవారం కాచిగూడలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమోదించిన స్కిల్ డెవలప్మెంట్, కంప్యూటర్ టీచర్ ట్రైనింగ్ కోర్సు, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సు, మాంటిస్సోరి టీచర్ ట్రైనింగ్ కోర్సు, నర్సరీ టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో యువతులు, మహిళలకు ఆన్లైన్లో శిక్షణ ఇవ్వన్నుట్లు పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థినిలు, మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9505800050, www.nationalskillacademy.inలో సంప్రదించవచ్చని సూచించారు.