Under-19 Asia Cup : అండర్ -19 ఆసియా కప్‌లో భారత కుర్రాడు అభిగ్యాన్ కుందు (209) డబుల్ సెంచరీతో చెలరేగాడు. మంగళవారం మలేషియా బౌలర్లను ఊచకోత కోస్తూ 9 సిక్సర్లతో రెచ్చిపోయి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. వేదాంత్ త్రివేది(90) మెరుపులు తోడవ్వడంతో నాలుగొందలు కొట్టిన యువ భారత్… అనంతరం ప్రత్యర్ధిని 93కే ఆలౌట్ చేసి.. 315 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. హ్యాట్రిక్ విజయాలతో అయుష్ మాత్రే సేన గ్రూప్ ఏలో అగ్రస్థానంతో సూపర్ 8కు చేరువైంది.
అండర్ -19 ఆసియా కప్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొసాగుతోంది. ఇప్పటికే యూఏఈ, పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా మూడో మ్యాచ్‌లో మలేషాయాను వణికించింది. దుబాయ్‌లోని సెవెన్స్ అకాడమీలో మంగళవారం కుర్రాళ్లు చితక్కొట్టగా 7 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది టీమిండియా. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(50) అర్ధ శతకంతో శుభారంభమివ్వగా.. కెప్టెన్ ఆయుష్ మాత్రే(14), విహాన్ మల్హోత్ర(7) లు విఫలమయ్యారు. 87 పరుగులకే మూడు వికెట్లు పడిన వేళ భారత్ రెండొదలకు పైగా చేస్తుందనిపించింది.
A performance to cherish! ✨
For his incredible double hundred, Abhigyan Kundu is adjudged the Player of the Match 🫡
India U19 register a massive 315-run victory over Malaysia U19 👏
Scorecard ▶️ https://t.co/mKbJZlZcj9#MensU19AsiaCup2025 pic.twitter.com/evBO2AXyW5
— BCCI (@BCCI) December 16, 2025
కానీ, మలేషియా బౌలర్లపై విరుచుకుపడిన అభిగ్యాన్ కుందు(209 125 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, వేదాంత్ త్రివేది(90) అర్ధ శతకంతో కదంతొక్కగా కొండంత స్కోర్ కొట్టిన యువ భారత్.. ఆ తర్వాత బౌలర్ల విజృంభణతో ప్రత్యర్ధిని 93కే ఆలౌట్ చేసింది. పాకిస్థాన్‌పై మూడు వికెట్లతో చెరేగిన దీపేశ్ దేవేంద్రన్ 5 వికెట్లతో మలేషియా నడ్డివిరిచాడు. ఉద్దవ్ మోహన్ రెండు వికెట్లతో రాణించాడు.