భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 11 : భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పూర్ గ్రామంలో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఆధ్వర్యంలో నిర్వహించే డాటా ఎంట్రీ ఆపరేటర్ (డిజిటల్ మిత్ర) శిక్షణ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంస్థ చైర్మన్ కిశోర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడున్నర నెలల కాలపరిమితితో కూడిన డాటా ఎంట్రీ ఆపరేటర్ శిక్షణ కోర్సుకు ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు అర్హులని వెల్లడించారు. ఉచిత శిక్షణ, హాస్టల్, భోజన వసతితో పాటు ఉద్యోగం కల్పించబడునన్నారు. ఈ నెల 15న రామానంద సంస్థలో అడ్మిషన్లు ప్రారంభమగునని తెలిపారు. వివరాలకు 9133908000, 9133908111, 9133908222, 9948466 111 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.