చండూరు, సెప్టెంబర్ 11 : చేనేత కార్మికులకు ఎల్లప్పుడు అండగా నిలుస్తానని, కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సహాయం చేస్తూనే ఉంటానని చండూరు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జూలూరు శ్రీనివాసులు అన్నారు. చండూరుకు చెందిన చేనేత కార్మికుడు చిలుకూరి మల్లేష్ ఇటీవల మృతి చెందగా గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. 50 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలను అందజేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
అలాగే నిరుపేద కుటుంబానికి చెందిన నల్ల పార్వతమ్మ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 50 కిలోల బియ్యం, నిత్యవసరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షుడు రాపోలు వెంకటేశం, చేనేత పరిరక్షణ సేవా సమితి ఫౌండర్ చైర్మన్ రాపోలు ప్రభాకర్, సహకార సంఘం డైరెక్టర్ చిట్టిపోలు వెంకటేశం, సిపిఎస్ ఉపాధ్యక్షుడు ఏలె శ్రీనివాస్, ఏలే శేఖర్ పాల్గొన్నారు.