భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 11 : ఆచార్య వినోబా భావే ఆశయాలు ప్రపంచానికి ఆదర్శప్రాయమని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో ఆచార్య వినోబా భావే 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భూదానోద్యమ పితామహుడు ఆచార్య వినోబా భావే, ప్రథమ భూదాత వెధిరే రామచంద్రారెడ్డి, కాంస్య విగ్రహాలకు వారు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రిటైర్డ్ టీచర్ రాచకొండ సత్తయ్యను శాలువాతో ఘనంగా సత్కరించి మెమొంటోను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 44 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని గుర్తు చేశారు. భూదానోద్యమం, పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు పోచంపల్లి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందని కొనియాడారు.
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఇక్కత్ డిజైన్ డూప్లికేట్ చేస్తున్నారని, ప్రింటెడ్ వస్త్రాలను అరికట్టాలని కేంద్ర చేనేత శాఖా మంత్రి గిరిరాజ్ సింగ్ను కలిసినట్లు తెలిపారు. భూదాన్ బోర్డును ఏర్పాటు చేపిస్తామన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామాల అభివృద్ధి, నెలకొన్న సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే సమావేశంలో అధికారులు మాత్రమే పాల్గొనాల్సి ఉండగా కాంగ్రెస్ నాయకులు సైతం రివ్యూ మీటింగ్కు హాజరు కావడం గమనార్హం.
ఈ కార్యక్రమంలో భూదాన యజ్ఞ బోర్డ్ మాజీ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి, జిల్లా నాయకులు తడక వెంకటేష్, కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూదన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాక మలేశ్, పట్టణ అధ్యక్షుడు భారత లవ కుమార్, పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ తడక రమేష్, నిజాం కళాశాల ప్రొఫెసర్ తడక యాదగిరి, నాయకులు కొట్టం కరుణాకర్ రెడ్డి, సీత శ్రీరాములు, ఏలే భిక్షపతి, సామ మోహన్ రెడ్డి, కుక్క దానయ్య, గుని గంటి రమేష్, బండారు ప్రకాష్ రెడ్డి, కొయ్యడ నరసింహ, ఉప్పునూతల వెంకటేష్, మంగళపల్లి రమేష్, భోగ నరసింహ పాల్గొన్నారు.