Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆగస్టు 21 తర్వాత తొలిసారిగా నిఫ్టీ 25వేల పాయింట్ల ఎగువన ముగిసింది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,217.30 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత కోలుకుంది. ఈ క్రమంలో ఇంట్రాడేలో 81,216.91 పాయింట్ల కనిష్టానికి చేరుకున్న సెన్సెక్స్.. 81,642.22 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది. చివరకు 123.58 పాయింట్ల లాభంతో 81,548.73 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 32.40 పాయింట్లు లాభపడి.. 25,005.50 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్లో ముగిశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ నిఫ్టీలో ప్రధాన లాభాలను ఆర్జించగా.. బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, విప్రో, టైటాన్ కంపెనీ నష్టాలను చవిచూశాయి.
ఇంధనం, పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా, చమురు-గ్యాస్, మీడియా 0.5శాతం నుంచి ఒకశాతం వరకు పెరిగాయి. ఐటీ ఇండెక్స్ 0.5శాతం పతనం కాగా.. ఆటో ఇండెక్స్ 0.3శాతం దిగజారింది. రంజిత్‌నగర్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్ సంఘటన కారణంగా గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ షేర్లు 3శాతం తగ్గాయి. కల్పతరు ప్రాజెక్ట్స్ షేర్లు 2.4శాతం లాభపడ్డాయి. రూ.2,720 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. ఇన్ఫోసిస్ షేర్లు 1.4శాతం పడిపోయాయి. బైబ్యాక్ కోసం బోర్డు సమావేశం జరగడానికి ముందే.. ఎంపీపీఎంసీఎల్ నుంచి LoA అందుకున్నప్పటికీ అదానీ పవర్ షేర్లు 1.5శాతం తగ్గాయి. అపోలో ఫండ్స్‌తో కన్సార్టియంలో మాలికాప్ను కొనుగోలు చేయాలనే సంస్థ ప్రణాళికతో టెగా ఇండస్ట్రీస్ షేర్లు 2శాతం పడిపోయాయి. వారీ ఎనర్జీస్, జైడస్ వెల్నెస్, ఇండియన్ బ్యాంక్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, గుజరాత్ మినరల్ వంటి 100 కంటే ఎక్కువ స్టాక్‌లు బీఎస్ఈలో 52 వారాల గరిష్ట స్థాయిలను తాకాయి.