న్యూఢిల్లీ, నవంబర్ 28 : అపోలో ఫార్మసీ విస్తరణను వేగవంతం చేసింది. వచ్చే ఐదేండ్లకాలంలో పది కోట్ల మంది కస్టమర్లు లక్ష్యంగా రోజుకు రెండు స్టోర్ల చొప్పున ప్రారంభించనున్నట్టు కంపెనీ సీఈవో పీ జయకుమార్ తెలిపారు.
శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని ఆయోధ్య వద్ద స్టోర్‌ను ప్రారంభించడంతో మొత్తం అవుట్లెట్ల సంఖ్య 7 వేలు దాటిందన్నారు. ప్రస్తుతం సంస్థ 19 వేల పిన్కోడ్లలో ప్రతిరోజు పది లక్షల ఆర్డర్లు వస్తున్నాయని అపోలో హెల్త్‌కో ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ శోభన కామినేని తెలిపారు.