హైదరాబాద్, నవంబర్ 27 : ప్రముఖ పిల్లల దవాఖానాల నిర్వహణ సంస్థ రెయిన్బో చిల్డ్రెన్ హాస్పిటల్స్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నది. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి తన పడకల సంఖ్య ను 3,165కి పెంచుకోనున్నట్టు ప్రకటించిన సంస్థ.. ఇందుకోసం రూ. 900 కోట్ల మేర నిధులను ఖర్చు చేయబోతున్నట్లు కంపెనీ సీఎండీ రమేశ్ కంచర్ల వెల్లడించారు.
దీంట్లోభాగంగా గురుగ్రామ్‌లో 450 పడకల మెడికల్ హబ్‌ను నెలకొల్పబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం సంస్థ దేశవ్యాప్తంగా 22 పిల్లల-ప్రసూతి హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఎలాంటి రుణాలు చేయడం లేదని, కంపెనీ వద్ద నిధులు పుష్కలంగా ఉన్నాయని, ప్రస్తుతం సంస్థ వద్ద ఉన్న రూ.550 కోట్ల నిధులను ఇందుకోసం వినియోగించనున్నట్టు చెప్పారు.