Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ ఆయనకు జ్వరం తీవ్రత తగ్గడం లేదు. పైగా దగ్గు కూడా ఎక్కువైంది. దీంతో పవన్ కల్యాణ్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్‌కు నాలుగు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లి వైద్యం చేయించుకోవాలని మంగళగిరి వైద్యులు సూచించారు. డాక్టర్ల సూచన మేరకు పవన్ కల్యాణ్ వైద్య పరీక్షల కోసం ఇవాళ మంగళగిరి నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతున్నప్పటికీ సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఆ రోజు రాత్రే పవన్ కల్యాణ్‌కు జ్వరం పెరిగింది. దీంతో విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కానీ రెస్ట్ తీసుకోకుండా శాఖపరమైన అంశాలపై అధికారులతో డిప్యూటీ సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని జనసేన పార్టీ తెలిపింది.