చండీఘడ్: మిగ్21 విమానాల రిటైర్మెంట్(MiG 21 Retirement) సందర్భంగా ఇవాళ చండీఘడ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరిగిన ఫేర్వెల్ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) ప్రసంగించారు. మిగ్21 కేవలం విమానం మాత్రమే కాదు అని, అది భారత్, రష్యా సంబంధాలకు సాక్ష్యం అన్నారు. 1971 యుద్ధాన్ని ఎవరూ మరిచిపోలేరని, పాకిస్థాన్‌తో జరిగిన ఆ వార్ సమయంలో.. ఢాకాలో ఉన్న గవర్నర్స్ హౌజ్‌పై మిగ్21 అటాక్ చేసిందన్నారు. ఇక ఆ రోజే యుద్ధం స్వరూపం మారిపోయిందన్నారు.
ఎప్పుడు చరిత్రాత్మక మిషన్స్ చేపట్టినా, అప్పుడు మిగ్21 త్రివర్ణ పతకాన్ని ఎగరవేసిందన్నారు. జాతి గర్వించదగ్గ ఆ సందర్భాలను ఫేర్‌వెల్‌లో గుర్తు చేసుకోవాలన్నారు. 1963 నుంచి భారతీయుల స్మృతుల్లో, మనోభావాల్లో మిగ్21 చిరస్థాయిగా నిలిచిందన్నారు. ఇది మనకు కేవలం ఫైటర్ జెట్ మాత్రమే కాదు, ఓ కుటుంబసభ్యుడి తరహాలో ఉండిపోయిందన్నారు. ఆ యుద్ధ విమానంతో డీప్ అటాచ్మెంట్ పెరిగిందన్నారు. మన విశ్వాసాన్ని పెంచి, మన వ్యూహాలను బలోపేతం చేసిందన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఆ జెట్.. ప్రతి సారి తన సామర్థ్యాన్ని ప్రదర్శించిందన్నారు.
40 ఏళ్లుగా ఇండియాలో మిగ్ విమానాలు ఎగురుతున్నా.. ఆ విమానాలు మాత్రం ఎప్పటికప్పుడు టెక్నికల్‌గా అప్డేట్ అయినట్లు చెప్పారు. మిగ్21 విమానాలను రకరకాల పేర్లతో పిలిచారని, త్రిశూల్, విక్రమ్, బాదల్, బైసన్ పేర్లతో పిలిచినట్లు చెప్పారు. మిగ్21ను ఎప్పటికప్పుడు రేడార్స్, ఏవియానిక్స్‌తో అప్డేట్ చేసిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థను ప్రశంసిస్తున్నట్లు రాజ్‌నాథ్ చెప్పారు.
#WATCH | Chandigarh: Defence Minister Rajnath Singh says, “The MiG-21 is deeply embedded in the memories and emotions of our country. Since 1963, when the MiG-21 first joined us, this journey of more than 60 years up to today is unmatched in itself. For all of us, this is not… pic.twitter.com/MGvBQtCH87
— ANI (@ANI) September 26, 2025