కేటీఆర్, హరీశ్‌రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా వారిపై మరో కేసు నమోదు చేశారు. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చేందుకు నల్ల టీషర్టుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. నల్ల టీషర్టుతో అసెంబ్లీ లోపలికి అనుమతించకపోవడంతో మెయిన్ గేటు ఎదురుగా టీషర్టు విప్పి హరీశ్‌రావు నిరసన తెలిపారు. ఈ కారణంతోనే కేటీఆర్, హరీశ్‌రావుపై మహిళా కానిస్టేబుల్‌తో ఫిర్యాదు చేయించి కేసు పెట్టారు.
కాగా, సోమవారం అసెంబ్లీ ప్రాంగణం వద్ద జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌రావుపై పలు కేసులు నమోదు చేశారు. పోలీసు అధికారులపై దాడి చేసి దూషించారనే ఆరోపణలతో హరీశ్‌రావు, కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపైనా కేసులు నమోదు చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎం బాలస్వామి ఫిర్యాదు మేరకు కేటీఆర్, హరీశ్ రావు, సుధీర్ రెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, శంబీపూర్ రాజు, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డి, సంజయ్, విజేయుడు, తాత మధు, నవీన్ కుమార్ రెడ్డి సహా మొత్తం 15 మందిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.