BRS | తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై చర్చించేందుకు వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హత్య చేసేందుకు వారి నివాసం దగ్గరకు పోలీసుల సాయంతో కాంగ్రెస్ నేతలు ర్యాలీగా వెళ్లడం, కేసీఆర్ చావు కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదిరింపులు, రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతలను సూచిస్తున్నాయని తెలిపారు. ఈ మూడు అంశాలపై సభలో వెంటనే చర్చించాలని కోరారు.
ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద్, విజయుడు తదితరులు వాయిదా తీర్మానం అందజేశారు.