Satish Jarkiholi: కర్నాటక మంత్రి సతీశ్, ఎంపీ ప్రియాంకా ఇంట్లో ఈడీ సోదాలు
ED Raids: కర్నాటక పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సతీశ్ జార్కిహోలీతో పాటు ఆయన కుమార్గె, ఎంపీ ప్రియాంకా జార్కిహోలీ నివాసాల్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తోంది. ఆ ఇద్దరి ప్రాపర్టీలకు చెందిన 18 ప్రాంతాల్లో ఆ తనిఖీలు కొనసాగుతున్నాయి.
బెంగుళూరు: కర్నాటక పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సతీశ్ జార్కిహోలీ(Satish Jarkiholi) నివాసాల్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తున్నది. మంత్రి సతీశ్ కుమార్తె, ఎంపీ ప్రియాంకా జార్కిహోలీ నివాసాల్లోనూ ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రాపర్టీలకు చెందిన కేసులో ఈ విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 18 ప్రదేశాల్లో సోదాలు జరుగుతున్నాయి. బెంగుళూరులోని డాలర్స్ కాలనీలో ఉన్న మంత్రి సతీశ్ ఇంటితో పాటు అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
చిక్కోడి లోక్‌సభ ఎంపీ ప్రియాంకాకు చెందిన బెల్తావి జిల్లాలోని ఇంటిని కూడా ఈడీ తనిఖీ చేస్తున్నది. మంత్రి, ఆయన కుమార్తె ఎంపీపై కొత్త కేసులో ఈ దర్యాప్తు సాగుతున్నట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. జార్కిహోలీ బావమరిది, ఎక్సైజ్ శాఖ ఆఫీసర్ వైడీ మంజునాథ్ కేసుతో లింకు లేదని ఈడీ చెబుతోంది. అయితే కేసు పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నది. బెంగుళూరు, బెల్గావి, గోకర్ణతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. జార్కిహోలీ ఫ్యామిలీ బిజినెస్‌తో పాటు కుటుంబసభ్యులు, సన్నిహితుల ఇండ్లల్లో తనిఖీలు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

