Iranian Oil Tankers: 5 ఇరానీ ట్యాంకర్లను పేల్చిన అమెరికా.. జోర్డాన్‌లో యూఎస్ బేస్‌పై అటాక్
Iranian Oil Tankers: ఇరాన్‌కు చెందిన అయిదు ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ చెప్పింది. దీనికి ప్రతీకారంగా జోర్డాన్‌లో ఉన్న అమెరికా బేస్‌లపై ఇరాన్ అటాక్ చేసింది. ఇరాన్ ఫైర్ చేసిన 18 క్షిపణులను అడ్డుకున్నట్లు జోర్డాన్ చెప్పింది.
టెహ్రాన్: ఇరానీ ట్యాంకర్ల(Iranian Oil Tankers)పై అమెరికా దళాలు అటాక్ చేశాయి. సుమారు అయిదు ట్యాంకర్లను పేల్చినట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల నుంచి అమెరికా యుద్ధనౌకను ఇరాన్ టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం ప్రతీకార దాడులకు దిగినట్లు సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. గల్ఫ్ ఆఫ్ ఓమన్‌లో ఉన్న ఐఆర్‌జీసీకి చెందిన నాలుగు ఇరానీ ఆయిల్ ట్యాంకర్లను టార్గెట్ చేసింది అమెరికా. ఖర్గ్ దీవి దగ్గర మరో ట్యాంకర్‌ను కూడా పేల్చేశారు. అమెరికా తాజా దాడులకు కౌంటర్‌గా ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసింది.
జోర్డాన్‌లో ఉన్న అమెరికా బేస్‌ను టార్గెట్ చేసింది. అయితే ఇరాన్ ప్రయోగించిన 20 క్షిపణులను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో ఎదుర్కొన్నట్లు జోర్డాన్ చెప్పింది. మొత్తం 18 క్షిపణులను కూల్చినట్లు పేర్కొన్నది. గత వారం నుంచి ఇరాన్, అమెరికా మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.
మరో వైపు ఆసియాలో ట్రేడింగ్‌లో ఇంధన ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌పై 1.5 శాతం పెరిగింది. ఇక అమెరికా ఇంధనం 1.6 శాతం అధికంగా ట్రేడింగ్ అయ్యింది. జోర్డాన్‌పై ఇరాన్ ఫైర్ చేసిన క్షిపణుల్లో రెండు మాత్రం జనాభా లేని ప్రాంతాల్లో పడినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

