టెహ్రాన్: అమెరికా మిలిటరీకి చెందిన అత్యాధునిక, స్మార్ట్, మానవరహిత జలాంతర్గామి(American submarine)ని స్వాధీనం చేసుకున్నట్లు ఇరానీ నేవీ ప్రకటించింది.హర్మూజ్ జలసంధి ఎంట్రెన్స్‌లో ఆ సబ్‌మెరైన్‌ను పట్టుకున్నట్లు చెప్పింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కు చెందిన అధికారిక వార్తా సంస్థ సెఫా న్యూస్ ఈ అంశంపై ప్రకటన జారీ చేసింది. మానవరహిత అండర్‌వాటర్ వెహికల్ డైవ్ ఎల్డీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది. చాలా సంక్లిష్టమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆ సబ్‌మెరైన్‌ను చేజిక్కించుకున్నట్లు ఐఆర్జేసీ వెల్లడించింది. సబ్మెర్సిబుల్ వెహికల్లో ప్రపంచంలోనే అత్యాధునిక సబ్‌సర్ఫేస్ వెహికల్ టెక్నాలజీ ఉన్నట్లు ఇరాన్ పేర్కొన్నది.
ఆ జలాంతర్గామికి చెందిన వీడియోను కూడా ఇరాన్ రిలీజ్ చేసింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను కూడా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూల్చివేసినట్లు ఐఆర్జీసీ ప్రత్యేక ప్రకటనలో పేర్కొన్నది. అయితే అమెరికా మిలిటరీ తాజాగా ఓ ప్రకటన చేసింది. తమకు చెందిన అండర్‌వాటర్ డ్రోన్ ఒకటి విఫలమైనట్లు పేర్కొన్నది. సముద్ర జలాల్లో సర్వే చేస్తున్న సమయంలో ఆ సబ్‌మెరైన్ మాల్ఫంక్షన్ అయినట్లు తెలిపింది.
ఆ డివైస్‌లో డిఫెక్ట్ ఉందని, అది అత్యాధునిక సున్నిత సమాచారాన్ని సేకరించలేకపోతున్నదని, సోనార్ లేదా రేడార్ డేటా ఆ డివైస్‌కు చిక్కడం లేదని అమెరికా మిలిటరీ పేర్కొన్నది. హర్మూజ్ జలసంధిలో సీమైన్లను ఇరాన్ అమర్చిన నేపథ్యంలో .. వివాదాస్పద జల ప్రాంతాల్లో అమెరికా తన అండర్‌వాటర్ వెహికల్స్‌తో మానిటరింగ్ చేస్తున్నది.
డైవ్-ఎల్డీ సబ్‌మెరైన్ బేస్‌కు చేరుకోకుండానే కనీసం 10 రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్ చేపట్టగలదు. సుమారు 6వేల మీటర్ల లోతుకు అది డైవ్ చేయగలదు. డైవ్-ఎల్డీ ఖరీదు సుమారు 2.5 మిలియన్ల డాలర్లు ఉంటుంది.
The first visuals have been released of the American Dive-LD unmanned submarine, seized by Iran’s Islamic Revolution Guards Corps (IRGC) early on Tuesday. pic.twitter.com/ump8zQZt7c
— IRNA News Agency ☫ (@IrnaEnglish) September 8, 2026