భైంసాటౌన్, మార్చి 19 : భైంసా మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి ఎమ్మె ల్యే విఠల్ రెడ్డి హాజరయ్యారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను గుర్తించి అ సెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ పెద్ద మనుసుతో య థావిధిగా ఉద్యోగంలోకి తీసుకుంటామని ప్రకటించడం హర్షణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏడు మండలాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఎమ్మెల్యే, ఎంపీపీని పూలమాల, శాలువాతో సన్మానించారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు, వైస్ ఎంపీపీ గంగాధర్, కోఆప్షన్ సభ్యుడు గజానంద్, ఎంపీటీసీ మాణిక్, టీఆర్ఎస్ నాయకులు గణేశ్ పాటిల్, సచిన్ పాటిల్, మెహరాజ్, పోతన్న, సోలంకి భీంరావ్ పాల్గొన్నారు.