IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో తొలి రెండు రోజులు పట్టు బిగించిన భారత్.. మూడో రోజు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్(James Anderson) తొలి సెషన్లోనే యశస్వీ జైస్వాల్(17), రోహిత్ శర్మ(13)లను ఔట్ చేశాడు. రోహిత్‌ను బౌల్డ్ చేసిన జిమ్మీ.. మరుసటి ఓవర్లో సూపర్ డెలివరీతో డబుల్ సెంచరీ వీరుడు యశస్వీని బోల్తా కొట్టించాడు.
దాంతో, భారత్ ఒక్క పరుగు వ్యవధిలోనే ఓపెనర్లను కోల్పోయింది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్(6), శ్రేయస్ అయ్యర్(6) క్రీజులో ఉన్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్.. 42/2 . రోహిత్ సేన ప్రస్తుతానికి 185 పరుగుల ఆధిక్యంలో ఉంది.
James Anderson has both openers now, as Jaiswal edges to Root in the slips #INDvENG
— ESPNcricinfo (@ESPNcricinfo) February 4, 2024
తొలి ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్ సూపర్ డబుల్ సెంచరీతో టీమిండియా కొండంత స్కోర్ చేసింది. అనంతరం ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌ను కుల్దీప్ దెబ్బ కొట్టాడు. డేంజరస్ ఓపెనర్ బెన్ డకెట్(21)ను ఔట్ చేసి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీతో జోరుమీదున్న మరో ఓపెనర్ జాక్ క్రాలే(76)ను అయ్యర్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు.
బుమ్రా( 45/6), యశస్వీ జైస్వాల్(209)
ఆ తర్వాత నిప్పులు చెరిగిన స్పీడ్‌స్టర్ బుమ్రా ఆరు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అతడి ధాటికి స్టోక్స్ సేన 253 రన్స్‌కే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్(47), తొలి టెస్టు హీరో ఓలీ పోప్(23)లు ఫర్వాలేదనిపించారు.