Ruhani sharma | నా కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది.. మొదట్లో అందుకు భయపడ్డా..!
Ruhani sharma | నేను చిన్నప్పటి నుంచీ వెంకీ సర్ సినిమాలు చూసేదాన్ని. ఆయనకు పెద్ద అభిమానిని కూడా! ఇప్పుడు ఆయనతోనే సినిమా చేయడం.. ఎంతో సంతోషంగా ఉంది. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచీ డాక్టర్ అవ్వాలని కోరిక.
నేను చిన్నప్పటి నుంచీ వెంకీ సర్ సినిమాలు చూసేదాన్ని. ఆయనకు పెద్ద అభిమానిని కూడా! ఇప్పుడు ఆయనతోనే సినిమా చేయడం.. ఎంతో సంతోషంగా ఉంది. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచీ డాక్టర్ అవ్వాలని కోరిక. అయితే, సినిమాల్లోకి రావడంతో ఆ కోరిక అలాగే ఉండిపోయింది. కానీ, సైంధవ్ సినిమాలో డాక్టర్ రేణు పాత్ర పోషించడంతో.. నా కోరిక ఇన్నాళ్లకు నెరవేరినట్లు అయ్యింది.
హిమాచల్ సోయగం రుహాని శర్మ.. ‘చి.ల.సౌ.!’తో తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే క్లాస్ ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ‘హిట్’ అందుకుని.. ‘డర్టీ హరి’, ‘101 జిల్లాల అందగాడు’తో ‘గ్లామరస్ హీరోయిన్’గా పేరు తెచ్చుకున్నది. ‘హర్’లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవర్‌ఫుల్‌గా నటించింది. తాజాగా.. ‘సైంధవ్’లో డాక్టర్ రేణుగా మెరిసిన రుహాని మనసు కహానీ..
‘హర్’ సినిమా కోసం నన్ను సంప్రదించినప్పుడు.. మొదట్లో కొంత భయపడ్డాను! ‘ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా. మీదే లీడ్ రోల్’ అనగానే.. ‘నేను చేయగలనా?’ అనే అనుమానం ఉండేది. కానీ, డైరెక్టర్ శ్రీధర్ ఎంతో నమ్మకంతో.. నన్ను ఒప్పించారు. చెప్పాలంటే.. రిస్క్ తీసుకొని మరీ ఈ సినిమా చేశాను!
మీకు తెలుసా అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ మాకు దగ్గరి బంధువులు. అనుష్క మా కజిన్. కోహ్లి మాకు వరుస బావ అవుతాడు. వాళ్లిద్దరూ చాలా సింపుల్‌గా ఉంటారు.. ఎలాంటి ఫిల్టర్ లేకుండా! మాతోనూ చాలా క్లోజ్‌గా ఉంటారు. ఆ నిరాడంబరత నాకు బాగా నచ్చుతుంది.
నాకు ట్రావెలింగ్ ఇష్టం. కొత్తకొత్త ప్రదేశాలను చుట్టిరావడం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి. షూటింగ్ కోసం ఎక్కడికి వెళ్లినా.. అక్కడి సంస్కృతి, స్థానిక వంటకాల గురించి ఆసక్తిగా తెలుసుకుంటాను.
ఆరోగ్యం, ఫిట్నెస్ కాపాడుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తాను. రోజూ తప్పకుండా చిన్నచిన్న వ్యాయామాలు చేస్తాను. జిమ్‌కు కూడా రెగ్యులర్‌గా వెళ్తాను. తరచూ స్విమ్మింగ్ చేస్తాను.
సినిమా అంటేనే గ్లామర్ షో! కానీ, అది కాస్తా మితిమీరక పోతేనే బాగుంటుంది. గ్లామర్ వరకూ ఓకే.. కానీ, వల్గారిటీకి మాత్రం నేనెప్పుడూ ‘నో’ అంటాను! కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా.. పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేయాలన్నది నా కోరిక. ‘హర్’లో అలాంటి పాత్రే పోషించాను! వీలైతే చూడండి.
షూటింగ్ లేని రోజుల్లో కుటుంబంతో గడపడానికే ఇష్టపడుతాను. నా ప్రతి విజయంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర. ప్రతి విషయాన్నీ వారితో తప్పకుండా షేర్ చేసుకుంటా. ఇక మా చెల్లెలితో కలిసి చేసే సందడి అంతా ఇంతా కాదు. మా ఇద్దరికీ మా అమ్మమ్మతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది.
డిగ్రీ పాసైన తర్వాత కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించాను. దీపికా పదుకోన్‌తో కలిసి ఓ యాడ్ కూడా చేశాను!
అది చూసే.. డైరెక్టర్ రాహుల్ రవీంద్ర సినిమా అవకాశం ఇచ్చారు.
‘తోటి మనుషులే కాదు.. తోటి జీవులపట్ల కూడా ప్రేమగా ఉండాలి’ అన్నదే నా ఫిలాసఫీ! పెంపుడు జంతువులంటే నాకు ప్రాణం. ముఖ్యంగా బుజ్జిబుజ్జి కుక్క పిల్లలు. నా పెంపుడు కుక్క పిల్ల పేరు.. పెన్నీ శర్మ!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

