వాషింగ్టన్: హెచ్1బీ ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ స్పందించారు. హెచ్1బీ వీసా ప్రోగ్రామ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై కోర్టుల్లో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అమెరికన్ కార్మికులను అవకాశాలను కల్పించడంతోపాటు వీసా వ్యవస్థను బలోపేతం చేయడమే అధ్యక్షుడి తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. చాలా కాలంగా హెచ్1బీ వ్యవస్థ మోసాలతో నిండి ఉందని, ఇది అమెరికన్ ఉద్యోగుల వేతనాలను తగ్గించిందని ఆరోపించారు.