వాషింగ్టన్: కెనడాతో అన్ని రకాల వాణిజ్య చర్చలను నిలిపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. అమెరికా విధించిన టారిఫ్ల గురించి కెనడా టెలివిజన్ ప్రకటనలో తప్పుగా చూపించారని, కోర్టుల నిర్ణయాలను ప్రభావితం చేయడమే దీని లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ టారిఫ్లకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు యాడ్లో చూపించారన్నారు. కెనడియన్ల దిగ్భ్రాంతికర ప్రవర్తన కారణంగా, కెనడాతో అన్ని వాణిజ్య చర్చలను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వివాదాస్పద టీవీ ప్రకటనను కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం రూపొందించింది.