వాషింగ్టన్, అక్టోబర్ 24: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పేరుతో వెనిజువెలా జలాల్లోని నౌకలపై దాడులు చేయిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు వెనిజువెలా సరిహద్దులో బాంబర్లను మోహరించారు. వెనిజువెలా తీరంలో అమెరికా యుద్ధ విన్యాసాలను ప్రదర్శించింది.
ఇప్పటికే కరేబియన్ సముద్రం, వెనిజువెలా జలాల్లో అమెరికా సైన్యం అసాధారణంగా పెద్దయెత్తున బలగాలను మోహరించింది. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించడానికి ప్రయత్నించవచ్చనే ఊహాగానాలు మరింత ముమ్మరమయ్యాయి. మదురో ఇప్పటికే అమెరికాలో నార్కో టెర్రరిజం ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.