న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సరికొత్త ‘సమ్మాన్ ప్లాన్’ను (Samman Plan) ఆవిష్కరించింది. ఏడాది కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్ ధర రూ.1,812గా నిర్ణయించింది. ఈ ప్లాన్ కింద అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాటు రోజుకు 2జీబీ డాటాతోపాటు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చును. 60 ఏండ్లకు పైబడి వారిని దృష్టిలో పెట్టుకొని సంస్థ ఈ ప్లాన్‌ను ఆవిష్కరించింది.
ఇది చౌకైన ప్లాన్‌తోపాటు ఏడాది కాలపరిమితితో అందిస్తున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల 18 వరకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ప్లాన్‌తో తరుచుగా రీచార్జి చేయాల్సిన అవసరం ఉండదు. దీంతోపాటు రూపాయికే 4జీ సిమ్‌తోపాటు నెలరోజుల పాటు ఉచితంగా టెలికాం సేవలు పొందే ప్లాన్‌ను సైతం ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని పేర్కొంది. ఈ ప్లాన్ కింద రోజుకు 2జీబీ డాటా, 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చును.