న్యూయార్క్: భారత సంతతి వ్యక్తి మెహుల్ గోస్వామి (39)ని న్యూయార్క్ అధికారులు ఈ నెల 15న అరెస్ట్ చేశారు. ఆయన న్యూయార్క్ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీస్‌లో ప్రభుత్వోద్యోగం చేస్తూనే, గ్లోబల్ ఫౌండ్రీస్ అనే సెమీ కండక్టర్ కంపెనీలో కాంట్రాక్టర్‌గా కూడా పని చేసినందుకు కేసు నమోదు చేశారు. ఆయన 2022 మార్చి నుంచి ఈ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు.
ఈ విషయాన్ని వివరిస్తూ ఓ ఆకాశ రామన్న ఈ-మెయిల్ రావడంతో దర్యాప్తు ప్రారంభమైంది. ఆయనకు గరిష్ఠంగా 15 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ఆయన 2024లో సుమారు రూ.1 కోటి సంపాదించారు.