పాన్ ఇండియా సినిమా పుష్ప (Pushpa)సక్సెస్ తర్వాత ఇండియావైడ్‌గా మంచి క్రేజ్ సంపాదించించాడు అల్లు అర్జున్ (Allu Arjun). ఈ సినిమా హీరోహీరోయిన్లకే కాదు ఇతర క్రాప్ట్స్ లో పనిచేసే చాలా మందిలో స్పూర్తి కలిగించింది. పుష్ఫ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఫాలోయింగ్ చూసి స్ఫూర్తి పొందిన వారిలో ఒకరు అతడి స్టైలిష్ట్ హర్మన్ కౌర్ (Harmann Kaur). తన ఎదుగుదలకు అల్లు అర్జున్ సాధనంలా పనిచేశాడని చెప్పుకొచ్చింది హర్మన్ కౌర్.
Daisy Shah Srivalli dance | శ్రీవల్లి పాటను దింపేసిన హిందీ హీరోయిన్..వీడియో వైరల్
ఒకరు తన నైపుణ్యం(క్రాప్ట్) లో రాణిస్తే..అప్పుడు పోటీ ప్రపంచంలోకి దూసుకెళ్లాలని నాతో చెప్పాడు. ప్రతీ విషయంపై అల్లు అర్జున్ శ్రద్ద చూపిస్తాడు. ప్రతీ సినిమాకు ఏదో కొత్తదనాన్ని అందించేందుకు ప్రయత్నిస్తాడు. అల వైకుంఠపురంలో సినిమాతోపాటు పలు సందర్భాల్లో అల్లు అర్జన్ స్టైలిష్ వర్క్ చేసింది హర్మన్. రానున్న రోజుల్లో అల్లు అర్జున్ ఇండియాలోనే పెద్ద స్టార్‌గా మారిపోవడం ఖాయమని చెప్తోంది.
ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్‌లో అల్లు అర్జున్ పోషించిన పుష్ప రాజ్ పాత్రను చాలా మంది సెలబ్రిటీలు ఇమినేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. శ్రీవల్లి పాటలోని అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు వేస్తూ నెట్టింటిని షేక్ చేస్తున్నారు.