పుష్పలోని చూపే బంగారమాయెనే శ్రీవల్లి పాట (Srivalli Song)ఏ రేంజ్లో పాపులారిటీ సంపాదించిందో మూవీ లవర్స్ కు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగుతోపాటు హిందీ (Bollywood), తమిళం, కన్నడ, మలయాళం..ఇలా విడుదలైన అన్ని భాషల్లో మిలియన్ల సంఖ్య వ్యూస్ రాబడుతూ..కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇపుడు శ్రీవల్లి హిందీ వెర్షన్ కు పాపులర్ హిందీ హీరోయిన్ చేసిన డ్యాన్స్ అదరహో అనిపిస్తోంది.
కొరియోగ్రాఫర్ ఆదిల్ ఖాన్ (Aadil Khan), బాలీవుడ్ భామ డైసీ షా (Daisy Shah) కలిసి శ్రీవల్లి పాట అందరి మనసు దోచేస్తుంది. శ్రీవల్లి పాటకు ముందుగా బ్లాక్ డ్రెస్లో ఆదిల్ ఖాన్, డైసీ షా ప్రాక్టీస్ సెషన్లో డ్యాన్స్ చేసి..ఆ తర్వాత పుష్పరాజ్, శ్రీవల్లి గెటప్ కు ట్రాన్స్ ఫార్మేషన్ అవడం చూడొచ్చు. ఇక ఆదిల్ ఖాన్, డైసీ షా నిజంగా పుష్పరాజ్, శ్రీవల్లి కలిసి డ్యాన్స్ చేశారా..? అన్నట్టుగా చేసిన డ్యాన్స్ వీడియో ఇపుడు ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది.
సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప..ది రైజ్ విడుదలైన అన్ని భాషల్లో మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు బన్నీ.