e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News Srivalli Marathi Version | పుష్ప 'శ్రీవ‌ల్లి' మ‌రాఠీ వ‌ర్ష‌న్ అదుర్స్‌.. నెటిజ‌న్లు ఫిదా : వైర‌ల్ వీడియో

Srivalli Marathi Version | పుష్ప ‘శ్రీవ‌ల్లి’ మ‌రాఠీ వ‌ర్ష‌న్ అదుర్స్‌.. నెటిజ‌న్లు ఫిదా : వైర‌ల్ వీడియో

police constable sings marathi version of pushpa song srivalli

Srivalli Marathi Version | పుష్ప సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా? భారీ అంచ‌నాల న‌డుమ రిలీజ్ అయి ప‌లు భాష‌ల్లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది సినిమా. ఇప్ప‌టికీ హౌస్ ఫుల్ అవుతూ సంక్రాంతికీ భారీ వ‌సూళ్లు సాధిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లోనూ సినిమా రిలీజ్ అయింది. దీంతో దేశ‌వ్యాప్తంగా ఈ సినిమా పేరు మారుమోగిపోయింది.

సినిమా మాత్ర‌మే.. పాట‌లు కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. శ్రీవ‌ల్లి పాట‌, ఊ అంటావా, సామీ పాటలు అయితే ఎక్క‌డ చూసినా ద‌ద్ద‌రిల్లిపోతున్నాయి. ఈనేప‌థ్యంలో పూణెకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ శ్రీవ‌ల్లి పాట‌కు మ‌రాఠీ వ‌ర్ష‌న్‌ను పాడాడు.

- Advertisement -

కానిస్టేబుల్ ఆటిష్ ఖ‌రాడేకు చిన్న‌ప్ప‌టి నుంచి మ్యూజిక్ అంటే ప్రాణం. ఇలా ప‌లు సినిమాల పాట‌ను సొంతంగా పాడి త‌న యూట్యూబ్ చానెల్‌లో షేర్ చేస్తుంటాడు. తాజాగా హిందీలో కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన పుష్ప సినిమాలోని శ్రీవ‌ల్లి పాట‌కు మ‌రాఠీ వ‌ర్ష‌న్‌ను పాడి డ్యాన్స్ కూడా చేసి అద‌ర‌గొట్టేశాడు ఆటిష్‌. ఆ వీడియోను త‌న యూట్యూబ్ చానెల్‌లో షేర్ చేయ‌డంతో ఆ వీడియోను చూసిన నెటిజ‌న్లు మ‌నోడి వాయిస్‌, డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు.

ఒరిజిన‌ల్‌ శ్రీవ‌ల్లి పాట‌ను దేవిశ్రీప్ర‌సాద్ కంపోజ్ చేయ‌గా చంద్ర‌బోస్ ర‌చించాడు. సిద్ శ్రీరామ్ తెలుగులో పాడాడు. ఈ సాంగ్ ఇప్ప‌టి వ‌ర‌కు యూట్యూబ్‌లో 17 మిలియ‌న్ల వ్యూస్ సాధించింది.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement