ఉ అంటావా మావ..ఊ ఊ అంటావా (Oo Antava)..తెలుగు ఆడియెన్స్ (Telugu Audience)నే కాదు ఇతర భాషల ప్రేక్షకులను ఓ ఊపు ఊపిన సాంగ్. పుష్ప చిత్రంలో సమంత (Samantha), అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ పాట థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. హాట్ హాట్ లుక్స్, స్టెప్పులతో కొద్ది నిమిషాలపాటు సమంత చేసిన సందడి సినిమాకే హైలెట్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సమంత లుక్ అండ్ ఫర్ పార్మెన్స్ పై కోస్టార్ ప్రియమణి (Priyamani) హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఉ అంటావా..ఊ ఊ అంటావా మావ పాటలో సమంత చాలా హాట్ కనిపించిందని చెప్పుకొచ్చింది. ఈ పాటలో సమంత హాట్ లుక్‌తో కనిపించింది..నాకే కాదు నా భర్తకు కూడా అలాంటి ఫీలింగే కలిగింది. సమంత మొత్తం కెరీర్లో ఎన్నడూ ఇలాంటి పర్ఫార్మెన్స్ చూడలేదు. సామ్ ఈ పాటను ఒప్పుకోవడం, అద్బుతంగా నటించడం అభినందించే విషయం. చాలా మంది జనాలు ఈ పాటను ఇప్పటికే డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ పాటతో రీల్స్ తయారు చేసుకున్నారని ఖచ్చితంగా చెప్పగలనంది ప్రియమణి.
అద్బుతంగా సాగే ఈ నంబర్ వన్ సాంగ్‌ను కంపోజ్ చేసిన దేవీ శ్రీ ప్రసాద్‌కు హాట్సాఫ్. ఈ పాటకు కొరియోగ్రఫీ చాలా అందంగా చేశారు. నాకైతే ఈ పాటలో సమంత చాలా హాట్‌గా కనిపించిందని మరోసారి చెబుతున్నట్టు సామ్ పై పొగడ్తల వర్షం కురిపించింది. సమంత, ప్రియమణి కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. ఇపుడు సామ్ గురించి ప్రియమణి చెప్పిన మాటలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.