నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత లైఫ్‌ను తనకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకుంది చెన్నై భామ సమంత (Samantha). ఈ బ్యూటీ తాజాగా నెట్టింట్లో పోస్ట్ చేసిన ఫొటోనే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇటీవలే ఊ అంటావా మావ..ఊ ఊ అంటావా అంటూ హాట్ హాట్ అందాలతో తళుక్కుమంది సామ్. ఈ సుందరి సోషల్‌మీడియాలో బికినీ గాళ్‌గా మారిన స్టిల్‌ను పోస్ట్ చేసింది. తానిక ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా స్విమ్ షూట్ ఫొటోను షేర్ చేసింది.
ఇంతకీ సామ్ ఎక్కడికెళ్లిందనే కదా మీ డౌటు. గోవాలో బీచ్ వెకేషన్ ను ఫుల్ ఎంజాయ్ చేసింది..ఇన్ స్టాగ్రామ్ పోస్టుకు #goayoubeauty. హ్యాష్ ట్యాగ్‌ను క్యాప్షన్ గా ఇచ్చింది. సమంత ప్రస్తుతం రాజ్-డీకే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరుణ్ ధావన్ మేల్ లీడ్ పోషిస్తున్నాడు.
దీంతోపాటు ఫీ మేల్ ఓరియెంటెడ్ కథాంశంతో ‘యశోద’ (Yashoda) చేస్తుంది. హరి-హరీశ్ (Hari-Harish) దర్శకత్వం వహిస్తున్నారు. సంపత్‌రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేశ్, దివ్య శ్రీపాద,ప్రియాంక శర్మ కీ రోల్స్ పోషిస్తున్నారు. సమంత మరోవైపు విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో కాతువాకుల రెండు కాధల్ చిత్రంలో నటిస్తోంది. నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో ఈ మూవీలో నటిస్తున్నారు.