‘సీఎంఆర్’ నిల్వకు స్థలం కేటాయించాలి : పౌరసరఫరాల సంస్థ చైర్మన్
‘సీఎంఆర్’ నిల్వకు స్థలం కేటాయించాలి | కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించేందుకు.. డిమాండ్‌కు అనుగుణంగా నిల్వ కోసం స్థలం కేటాయించాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్

హైదరాబాద్ : కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించేందుకు.. డిమాండ్‌కు అనుగుణంగా నిల్వ కోసం స్థలం కేటాయించాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఎఫ్ఐసీని కోరారు. సోమవారం పౌర సరఫరాల భవన్‌లోని కార్యాలయంలో జరిగిన బోర్డు సమావేశం జరిగింది. సంస్థ ఎండీ అనిల్‌కుమార్, జనరల్ మేనేజర్లు రాజారెడ్డి, శ్రీనివాసరావు, నాగేందర్ రెడ్డి, అసిస్టెంట్ సెక్రెటరీ సురేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు, రైతులకు చెల్లింపులు, గన్నీ సంచులు, సీఎంఆర్‌పై సుదీర్ఘంగా చర్చించారు. బియ్యం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్న నిల్వ చేసేందుకు స్థలం లేక జాప్యం జరుగుతోందన్నారు.
పౌర సరఫరాల సంస్థపై ఆర్థిక భారం పడకుండా ఎఫ్‌సీఐ సమన్వయం చేసుకుని సీఎంఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. యాసంగిలో పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి 92లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు అప్పగించిందన్నారు. 63 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలని, గడువులోగా అప్పగించాలంటే నెలకు 8 నుంచి 10 లక్షల వరకు ఇవాల్సి ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎఫ్‌సీఐతో పాటు జిల్లా అధికారులతో ప్రతి రోజూ మానిటరింగ్ చేసి సీఎంఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
అలాగే ఎఫ్‌సీఐ నుంచి రావాల్సిన బకాయిలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) శ్రీనివాసరావును ఆదేశించారు. రైతులకు చెల్లింపు కోసం నాబార్డ్ నుంచి రూ.600 కోట్ల రుణం తీసుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. యాసంగి సీజన్ ముగిసిన నేపథ్యంలో గన్నీ సంచుల రికన్సిలేషన్పై దృష్టిసారించాలని జీఎం నాగేందర్‌రెడ్డిని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
జూలై 20న జియోమి 5జి ఫోన్
రాజేంద్రనగర్‌లో మంటలు చెలరేగి కారు దగ్ధం
నిబంధనలు పాటించని ఫలితం.. జన్‌పథ్ మార్కెట్ మూసివేత
ద్విచక్ర వాహనాల చోరీ ముఠా అరెస్ట్
కరోనా సెకండ్ వేవ్ నుంచి బయటపడ్డాం : డీహెచ్ శ్రీనివాసరావు
కాంగ్రెస్ పార్టీకి పాడి కౌశిక్‌రెడ్డి రాజీనామా?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

