కరోనా సెకండ్ వేవ్ నుంచి బయటపడ్డాం : డీహెచ్ శ్రీనివాసరావు
కరెండో సెకండ్ వేవ్ నుంచి బయటపడ్డాం : డీహెచ్ శ్రీనివాసరావు | కరోనా రెండో దశవ్యాప్తి నుంచి రాష్ట్రం బయటపడిందని వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. కరీంనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా కట్టడిలో, వ్యాక్సినేషన్లో రాష్ట్రం మోడల్‌గా

హైదరాబాద్ : కరోనా రెండో దశవ్యాప్తి నుంచి రాష్ట్రం బయటపడిందని వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. కరీంనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా కట్టడిలో, వ్యాక్సినేషన్లో రాష్ట్రం మోడల్‌గా నిలిచిందన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో బాధాకరమైన, నిస్సహాయకరమైన పరిస్థితులు ఎక్కడా కనిపించలేదన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ పడకల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరా లేక రోగులు మృతి చెందారని, దవాఖానల్లో బెడ్స్ లేక ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్రంలో వైద్య సౌకర్యాల కొరత లేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఏ సమయంలోనూ ఎలాంటి ఇబ్బందులు లేవని.. మొదటి వేవ్ సమయంలో 28వేల బెడ్స్ ఉంటే రెండో దశ వరకు 50వేలకు పెంచినట్లు చెప్పారు. మూడో దశ ముప్పు పొంచి ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అన్ని రకాలుగా సంసిద్ధమైనట్లు వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న ఆసుపత్రుల్లో పిల్లల ఐసీయూ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని అన్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రజల సహకారం లేనిదే మహమ్మారి కట్టడి చేయడం సాధ్యం కాదన్నారు.
గత ఏడాదిగా పాటిస్తూ వస్తున్న మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం కొనసాగించాలన్నారు. వీలైనంత వరకు జనసమూహాలతో కూడిన కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. అయితే, వైరస్ నుంచి పూర్తిగా ముప్పు తొలగిపోలేదని, వైరస్ ప్రవర్తన ప్రజలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. కేసులు తగ్గుముఖం పడుతున్న ప్రజలు మాస్క్‌లు ధరించడం, వ్యాక్సిన్ తీసుకోవడం కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో శరవేగంగా వ్యాక్సినేషన్ జరుగుతోందని, ఇప్పటి వరకు 1.25 కోట్ల డోసులు పంపిణీ చేశామని చెప్పారు. మరో వైపు మరోవైపు రాష్ట్రంలో ఫీవర్ సర్వే కొనసాగుతోందని, దీని ద్వారా ఫాజిటివిటీ రేటు తగ్గించుకోవచ్చని చెప్పారు.
వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. గత మూడు, నాలుగేళ్లలో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, టైఫాయిడ్ కేసులు తగ్గాయన్నారు. అన్ని జిల్లాల్లోనూ కొత్తగా మలేరియా కేసులు నమోదు కాలేదని వివరించారు. జిల్లాల్లో కొనసాగుతున్న ఫీవర్ సర్వేపై సీఎం, రాష్ట్ర కేబినెట్‌కు సమర్పించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం మహమ్మారి కట్టడికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.
ఇవి కూడా చదవండి..
జూలై 20న జియోమి 5జి ఫోన్
రాజేంద్రనగర్‌లో మంటలు చెలరేగి కారు దగ్ధం
నిబంధనలు పాటించని ఫలితం.. జన్‌పథ్ మార్కెట్ మూసివేత
ద్విచక్ర వాహనాల చోరీ ముఠా అరెస్ట్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

