– ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూర్ అశోక్ గౌడ్
రాజాపేట, ఆగస్టు 18 : బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సాధించేందుకు బహుజనులంతా ఏకమై ముందుకు సాగాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఊట్కూరు అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం రాజాపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు సూదగాని హరిశంకర్ గౌడ్, గోదా శ్రీరాములు, మండల అధ్యక్షులు పాండవుల లక్ష్మణ్ గౌడ్, సిల్వర్ బాలరాజ్ గౌడ్, నమిలే మహేందర్ గౌడ్, సంధిల భాస్కర్ గౌడ్ పల్లె సంతోష్ గౌడ్, బాలమణి యాదగిరి గౌడ్, రూప బాలనరసయ్య గౌడ్, కేదారి గౌడ్, నరేష్ గౌడ్, సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.