కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్( Kubheer ) మండల కేంద్రంలోని మరో పండరిపురంగా పిలుచుకునే విఠలేశ్వరాలయంలో మంగళవారం అఖండ హరినామ సప్తాహ (Akhanda Harinama Saptaha) మంత్రోచ్చరణలనడుమ ఘనంగా ప్రారంభమైంది. ఆలయ పూజారులు ప్రమోద్ మహారాజ్, రాజు మహారాజ్ ఆలయ ప్రాంగణంలోని గణపతి, విఠల-రుక్మిణి విగ్రహాలకు ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు.
ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో నిర్ణయించిన ముహూర్తంలో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పెంటాజీ, ఉపాధ్యక్షుడు రాజన్న, కార్యదర్శి బచ్చు ప్రసాద్, గ్రామస్తులు పుప్పాల పీరాజి, కందుర్ రాజన్న, భజన కారులు, తదితరులు పాల్గొన్నారు.