నార్నూర్ : ఈనెల 23న ఉట్నూరులో నిర్వహించనున్న ధర్మ యుద్ధం ( Dharma Yudham ) బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు దాది రావు( Dadi Rao ) పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్( Narnoor ) మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లను ( Posters ) ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టబద్ధత లేని లంబాడలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఏకైక డిమాండ్ తోనే ఈనెల 23న బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ఆదివాసి 9 తెగలకు చెందిన అనుబంధ సంఘాల నాయకులు, మేధావులు, ఉద్యోగస్తులు, యువత పెద్ద సంఖ్యలో తల్లి రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షుడు మెస్రం మాణిక్ రావు, విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు కనక హన్మంతరావు, ప్రచార కార్యదర్శి ఉర్వేత క్రిష్ణ, లక్ష్మణ్, సుంగు, జైవంత్ రావ్, సంజీవ్ తదితరులున్నారు.