ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్, అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈ సంద ర్భంగా పలు శాఖలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి అధికారు లతో మాట్లాడి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగించాల న్నారు. మండల ప్రత్యేక అధికారు లు ఫీల్డ్ విజిట్ చేయాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకల్యాణి, జడ్పీ సీఈవో గోవింద్, అధికారులు పాల్గొన్నారు.
– నిర్మల్ చైన్గేట్, నవంబర్ 11
నిర్మల్ పట్టణంలోని వినాయక్సాగర్(బంగల్పేట) చెరువులో పర్యావరణాన్ని రక్షించాలని కలెక్టర్కు స్థానికులు వినతిపత్రం సమర్పించారు. పరిశుభ్రమైన చెరువులో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వస్తున్న వ్యర్థాలు, సూదులు, మందు సీసాలు, ప్లాస్టిక్ సంచులు, మైల బట్టల వంటి చెత్త పడేయడం ద్వారా నీరు కలుషితం అవుతుందని తెలిపారు. ఈ చెరువులో నిత్యం వందలాది మంది ప్రజలు స్నానాలు చేస్తుంటారని, ఇది ప్రజారోగ్యానికి ప్రమాదమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, గుమ్ముల అశోక్, బోడ శ్రీనివాస్, తొగ్గిటి చారి, జంగిటి శ్రీనివాస్, పురస్తు మల్లేశ్, ఈదన్నగారి రాజేశ్వర్, తోట రవి, సల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పునరావాస గ్రామమైన మైసంపేట్, రాంపూర్ గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు సోమవారం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పునరావాస ప్రాజెక్టులో భాగంగా తమ కుటుంబాలకు 2024లో ఇదే మండలంలోని కొత్తమద్దిపడగ శివారులో పునరావాసం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అక్కడికి వచ్చి 18 నెలలవుతున్నా అభివృద్ధి పనులు చేపట్టలేదని గ్రామస్తులు పేర్కొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సోమవారం నిర్మల్ కలెక్టర్కు బహుజన్ లెఫ్ట్ పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గణేశ్ పాల్గొన్నారు.
నిర్మల్ పట్టణంలోని 21, 41, 35, 17, 20 వార్డుల్లోని సమస్యలు పరిష్కరించాలని మాజీ కౌన్సిలర్లు, స్థానికులు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. నిర్మల్ పట్టణంలోని ఆయా వార్డులలో మురుగు కాలువలు లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. సీసీ రోడ్లు లేకపోవడంతో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని డబుల్ బెడ్రూంలను అర్హులకు కేటాయించాలని కోరుతూ ఖానాపూర్వాసులు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూంలు అర్హులైన పేదలకు కేటాయించాలని కోరారు. కేటాయింపులో అవకతవకలు జరిగాయని, విచారణ జరిపి అర్హులైన నిరుపేదలకు అందించాలని కోరారు. సర్వేల పేరిట కాలయాపన చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ పట్టణవాసులు పాల్గొన్నారు.
ఎదులాపురం, నవంబర్ 10 : ప్రజలు అందించే అర్జీలను త్వరితగతిన పరిషరించే దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అర్జీదారుల వినతులు స్వీకరించి వారి సమస్యలను ఆలకించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిషారం చూపే దిశగా చూడాలని కలెక్టర్ సూచించారు. వినతులకు సంబంధించిన వివరాలను ఫిర్యాదుదారులకు తెలియచేయాలని పేరొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలదేవి, ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు పాల్గొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న డయా గ్నొస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకోవా లని సీపీఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి భూక్యా రమేశ్, నాయకులు సోమవా రం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించా రు. క్లీనికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు ప్రకారం ఏ వ్యాధి నిర్ధారణ పరీక్షకు ఎంత డబ్బు తీసుకోవాలో ఆసుపత్రుల్లో డిస్ప్లే బోర్డులో ప్రదర్శించాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్లలో తనిఖీలు చేయాలని కోరారు.