Bihar polls : బీహార్ (Bihar) లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్ ముగింపు దశకు చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 60.40 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి మరో 6 నుంచి 7 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కిషన్‌గంజ్ జిల్లాలో అత్యధికంగా 66.10 శాతం పోలింగ్ నమోదైంది.
పూర్ణియా 64.22 శాతం, కతిహార్ 63.80 శాతం, జాముయ్ 63.33 శాతం, బంకా 63.03 శాతం ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. నవాడాలో అత్యల్పంగా 53.17 శాతం పోలింగ్ నమోదైంది. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే పూర్వి చంపారన్‌లో అత్యధికంగా 61.92 శాతం పోలింగ్ జరిగింది. ఝంఝార్‌పూర్‌లో అత్యల్పంగా 51.89 శాతం పోలింగ్ నమోదైంది.
కాగా బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో భాగంగా ఈ నెల 6న 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇవాళ మిగతా 122 స్థానాల్లో రెండో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.